ఏకపక్ష వార్తలను నిలిపివేసి నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిందిగా మీడియాను ఆదేశించాలంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులను కోర్టు వాయిదా వేసింది.
సల్మాన్ కేసులో ఉత్తర్వులు వాయిదా వేసిన కోర్టు
Sep 5 2013 11:11 PM | Updated on Apr 3 2019 6:23 PM
ముంబై: ఏకపక్ష వార్తలను నిలిపివేసి నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిందిగా మీడియాను ఆదేశించాలంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులను కోర్టు వాయిదా వేసింది. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో తన పాత్రపై మీడియా ఏక పక్ష వార్తలు రాస్తోందని ఆరోపించాడు. ఇదే కేసుకు సంబంధించి సామాజిక కార్యకర్త సంతోష్ దౌండ్కార్ మరో రెండు పిటిషన్లు కూడా కోర్టు విచారణలో ఉన్నాయి.
ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు తనను అనుమతించాలని దౌండ్కర్ కోరాడు. తన ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సెషన్స్ కోర్టు బదిలీ చేయాలని, తప్పుడు సాక్ష్యాలు ఇచ్చిన పోలీసులు, సల్మాన్‌పై చర్య తీసుకోవాలని రెండో పిటిషన్‌లో కోరాడు. దౌండేకర్ ప్రాసిక్యూషన్‌కు సహాయపడతానంటే అభ్యం తరం లేదని సల్మాన్ న్యాయవాదులు స్పష్టం చేశారు. అందరి వాదనలను విన్న జడ్జి ఎస్‌డీ దేశ్‌పాండే ఉత్తర్వును సెప్టెంబర్ 24 వరకు వాయిదా వేశారు.
Advertisement
Advertisement