పట్టాభిషేకం ప్రారంభం | Coronation of yaduveer krishnaduttha starts in mysore palace | Sakshi
Sakshi News home page

పట్టాభిషేకం ప్రారంభం

May 28 2015 1:41 PM | Updated on Sep 3 2017 2:50 AM

పట్టాభిషేకం ప్రారంభం

పట్టాభిషేకం ప్రారంభం

యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్‌కు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో మంగళస్నానం చేయించారు

మైసూరు ఉత్తరాధికారిగా యదువీర్ పట్టాభిషేక మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో మైసూరులోని ప్యాలెస్ కొత్త కాంతులతో తళుకులీనుతోంది. ఇక పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే మైసూరు ప్యాలెస్‌లో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
 
సాక్షి, బెంగళూరు: యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్‌కు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో మంగళస్నానం చేయించారు. దీంతో ప్యాలెస్‌లో ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం రాజ లాంఛనాలతో ఊరేగింపుగా బయల్దేరిన యదువీర్ ప్యాలెస్ ఆవరణలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం ప్యాలెస్‌లోనికి ప్రవేశించారు. ఆ తర్వాత ప్యాలెస్‌లో గణపతి పూజతోపాటు ఇతర ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇక యదువీర్ పట్టాభిషేకం గురువారం ఉదయం 9.30 గంటలకు శుభ కర్కాటక లగ్నంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు మైసూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీనివాస ప్రసాద్ తదితరులు హాజరు కానున్నారు.



 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement