మహిళా సర్పంచ్‌కు కలెక్టర్‌ ప్రశంస

Collector Appreciation For Women Sarpanch In Odisha - Sakshi

కరోనా కట్టడిలో నారాయణపూర్‌ గ్రామ సర్పంచ్‌  

స్వయంగా మాస్కులు కుట్టి, గ్రామస్తులకు పంపిణీ

ఒడిశా: కరోనా కట్టడిలో గ్రామపంచాయతీ సర్పంచ్‌లను భాగస్వాములను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొంతమంది సర్పంచ్‌లు కరోనా కట్టడి చర్యల్లో నిమగ్నమవుతూ వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు తమవంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రాయగడ సమితి, నారాయణపూర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ జమునాదేవి ప్రధాన్‌ను కలెక్టర్‌ అనుపమకుమార్‌ సాహా ప్రశంసించారు. గ్రామంలోని వార్డు సభ్యులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కరోనా నివారణలో ఆమె చేస్తున్న కృషిని ఇప్పుడు అధికారులు మెచ్చుకుంటున్నారు. చదవండి: ఏపీ ప్రభుత్వ పథకాలకు జాతీయస్థాయి ప్రశంసలు 


ఇంట్లో స్వయంగా మాస్క్‌లు కుడుతున్న సర్పంచ్‌

దాదాపు 1000 మాస్కులు కొనుగోలు చేసి, వాటిని గ్రామస్తులకు ఉచితంగా పంచిపెట్టారు. అలాగే ఒక్కొక్కసారి ఇంట్లో ఖాళీ సమయంలో మాసు్కలు స్వయంగా కుట్టి, గ్రామస్తులకు అందజేస్తున్నారు. వీటితో పాటు ఓ ఆటో బుక్‌ చేసి మరీ మైక్‌సెట్‌లో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఎప్పటికప్పుడు ఆమె చేస్తున్న ప్రచారం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కరోనా నివారణలో ఈమె నిబద్ధతను చూసిన అధికారులు మిగతా సర్పంచ్‌లు కూడా ఈమె లాగా కృషి చేయాలని కోరుతున్నారు.  చదవండి: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్‌కు నోటీసులు  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top