అమ్మ మాట | Chief Minister Jayalalithaa spoke in Mike | Sakshi
Sakshi News home page

అమ్మ మాట

Nov 26 2016 2:56 AM | Updated on Sep 4 2017 9:06 PM

ముఖ్యమంత్రి జయలలిత మైక్ సహాయంతో కొద్దిసేపు మాట్లాడారని, ఆమె ఆరోగ్యం సాధారణస్థితికి చేరుకుందని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు

మైక్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి జయ
డిశ్చార్జ్ ఆమె అభీష్టమే
అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి

 
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత మైక్ సహాయంతో కొద్దిసేపు మాట్లాడారని, ఆమె ఆరోగ్యం సాధారణస్థితికి చేరుకుందని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలితకు దేశ, విదేశీ వైద్యులు సుమారు రెండు నెలలపాటు చికిత్సను అందించారు. ఆమె ఆస్పత్రిలో చేరి శుక్రవారానికి 64 రోజులు పూర్తరుుంది. ముఖ్యమంత్రి బాగా కోలుకున్నట్లు రెండువారాల క్రితమే అపోలో అధినేత ప్రతాప్ సీ రెడ్డి ప్రకటించారు.

అవయవదానంపై అపోలో ఆస్పత్రి శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఫిజియోథెరపీ వల్ల ముఖ్యమంత్రి సహజస్థితికి చేరుకున్నారని చెప్పారు. మైక్ సహాయంతో కొద్ది నిమిషాలు ఆమె మాట్లాడారని, 90 శాతం వరకూ ఆమె సహజసిద్ధంగా శ్వాస తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అపోలో ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ కావాలని ముఖ్యమంత్రి మనస్సులో ఉందో తెలుసుకునేందుకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నామని తెలిపారు. డిశ్చార్జ్ ఎప్పుడనేది ఆమె అభీష్టమని, ఎప్పుడైనా ఇంటికి వెళ్లవచ్చని ఆయన తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement