ఆస్పత్రిలో సెల్‌ దొంగలు | Cell phones stolen by thiefs in Guntur Govt Hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో సెల్‌ దొంగలు

Oct 17 2016 11:17 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దొంగలు హల్‌చల్‌ చేశారు.

గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దొంగలు హల్‌చల్‌ చేశారు. సోమవారం ఉదయం ఆస్పత్రి జనరల్‌ వార్డులోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు నిద్రిస్తున్న ఒక రోగికి చెందిన సెల్‌ఫోన్‌తోపాటు నగదును అపహరించుకుపోయారు. అయితే, వారి అనుమానాస్పద కదలికలను పసిగట్టిన అక్కడి వారు ఆ ఇద్దరినీ పట్టుకుని దేహశుద్ధి చేశారు. సొత్తును స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రిలో అసాంఘిక శక్తుల సంచారంపై రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement