విష్ణుప్రియ ఆత్మహత్య కేసులో పోలీసుల తంటాలు | CBI team in Namakkal to probe Vishnupriya suicide case | Sakshi
Sakshi News home page

విష్ణుప్రియ ఆత్మహత్య కేసులో పోలీసుల తంటాలు

Dec 12 2016 2:43 AM | Updated on Sep 4 2017 10:28 PM

విష్ణుప్రియ ఆత్మహత్య కేసులో పోలీసుల తంటాలు

విష్ణుప్రియ ఆత్మహత్య కేసులో పోలీసుల తంటాలు

తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్య కేసులో సీబీఐ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక పోలీసు అధికారులు తంటాలు పడుతున్నారు.

టీనగర్: తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్య కేసులో సీబీఐ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక పోలీసు అధికారులు తంటాలు పడుతున్నారు. సేలం జిల్లా ఓమలూర్‌కు చెందిన ఇంజినీర్ గోకుల్‌రాజ్ గతేడాది జూన్ నెలలో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ(29) విచారణ చేపట్టిన రెండు నెలల్లోనే తన కార్యాలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసుపై ఆరంభంలో తిరుచెంగోడు పోలీసులు, తర్వాత సీబీసీఐడీ పోలీసులు విచారణ జరిపారు. దీనిపై విష్ణుప్రియ తండ్రి రవి సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టింది. ఇలాఉండగా సీబీఐ అధికారుల ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు ఇవ్వలేక తంటాలు పడుతున్నట్లు సమాచారం. వారంరోజుల్లో సీబీఐ అధికారులు నామక్కల్‌లో బసచేసి విచారణ జరపనున్నందున జిల్లాలోని పోలీసు అధికారుల్లో గుబులు రేగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement