బెస్ట్‌కు అభివృద్ధి పనుల ‘బ్రేక్’! | break for buses due to development of metro | Sakshi
Sakshi News home page

బెస్ట్‌కు అభివృద్ధి పనుల ‘బ్రేక్’!

Sep 1 2013 12:29 AM | Updated on Aug 30 2018 5:49 PM

మోనో-మెట్రో రైల్వే నిర్మాణాలు, రోడ్డు మరమ్మతులు, నీటి పైపుల మరమ్మతులు ఇలా తరచూ కొనసాగుతున్న పట్టణంలోని అభివృద్ధి పనుల వల్ల బెస్ట్ బస్సు సేవలకు అంతరాయం కలుగుతోంది.

 సాక్షి ముంబై: మోనో-మెట్రో రైల్వే నిర్మాణాలు, రోడ్డు మరమ్మతులు, నీటి పైపుల మరమ్మతులు ఇలా తరచూ కొనసాగుతున్న పట్టణంలోని అభివృద్ధి పనుల వల్ల బెస్ట్ బస్సు సేవలకు అంతరాయం కలుగుతోంది. దీంతో బెస్ట్ సుమారు 882 మార్గాలను మళ్లించాల్సి వచ్చింది. కాగా తొమ్మిది మార్గాల్లో సేవలను రద్దు చేసింది. మార్గాలను మళ్లించడంతో ప్రయాణికులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. అంతేకాకుండా బెస్టు నష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రయాణికుల సంఖ్య, సంబంధిత మార్గాల నుంచి లభించే ఆదాయం తదితర విషయాలపై ఆలోచించి బెస్ట్ బస్సు సేవల మార్గాలను తయారు చేస్తారు. ఆ తర్వాత బస్సుల సంఖ్య నిర్ణయిస్తారు. కానీ ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి పనుల కారణంగా అనేక సార్లు బస్సుల మార్గాలను మళ్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మళ్లింపు వల్ల అనేక మంది ప్రయాణికులు మరో బస్టాప్‌కు వెళ్లడంతో వారికి నడిచే పని పెరుగుతోంది. దీనివల్ల చాలా మంది బస్సుల్లో ప్రయాణించడం లేదు. ఈ పరిణామంతో బెస్ట్‌కు ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల బెస్ట్‌కు నష్టం కలుగుతోంది కాని వాటినుంచి ఎటువంటి నష్టపరిహారం లభిం చడం లేదని బెస్ట్ అధికారి అనిల్ గలగలీ తెలిపారు.
 
 బీఎంసీ కారణంగా ఎక్కువ
 మార్గాలను మళ్లించారు..
 నగరంలో అభివృద్ధి పనుల కారణంగా బెస్ట్ సుమారు 882 మార్గాలను  మళ్లించింది. అందులో అత్యధికంగా 550 మార్గాలు కేవలం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కారణంగా మళ్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌డీఏ) కారణంగా 276 మార్గాలను మార్చింది.
 డిపోలవారీగా బస్సు మార్గాలను మళ్లించిన వివరాలు........
 
 డిపోలు    మార్గాలు    మళ్లించిన సంఖ్య
 ఆణిక్            95
 ములుండ్        78
 ఘాట్కోపర్        74
 కుర్లా            70
 వడాలా            63
 భోయిసర్        56
 విక్రోలి            53
 ప్రతీక్షానగర్        50
 మరోళ్            47

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement