డెంగీ లక్షణాలతో బాలుడి మృతి? | boy died in vizianagaram over dengue virus | Sakshi
Sakshi News home page

డెంగీ లక్షణాలతో బాలుడి మృతి?

Sep 28 2016 8:46 AM | Updated on Jul 12 2019 3:02 PM

డెంగీపై ‘సాక్షి’ కథనంతో పీహెచ్‌సీ అధికారులు స్పందించారు.

పార్వతీపురం : మండలంలోని గోపాలపురంలో డెంగీ లక్షణాలతో  బాధపడిన పాలీల లోకేష్‌(20నెలలు) అనే పసికందు  మంగళవారం మృతిచెందాడు. ఈ బాలుడు విశాఖపట్నం ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ మరణించాడు. అయితే ఈ బాలుడు కిడ్నీ ఫెయిల్యూర్‌ కావడంతో మృతిచెందినట్లు వైద్యపరీక్షల్లో తేలిందని బందలుప్పి పీహెచ్‌సీ వైద్యాధికారి డా. కృష్ణంరాజు తెలిపారు.

గోపాలపురంలో డెంగీ కలకలం అన్న శీర్షికతో ‘సాక్షి’ దినపత్రికలో వెలువడిన కథనంతో బందలుప్పి పీహెచ్‌సీ అధికారులు, ఈఓపీఆర్‌డీ కూర్మనాథ్‌ పట్నాయక్‌ అప్రమత్తమై గ్రామంలో హుటాహుటిన వైద్యశిబిరం ఏర్పాటు చే శారు. గ్రామంలో కాలువలు, రోడ్లను శుభ్రం చేసే పారిశుద్ధ్య పనులను చేపట్టారు. లోకేష్‌ మరణ వార్తతో గ్రామస్తుల్లో భయం పుట్టి ప్రతి ఒక్కరూ  వైద్యశిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఈఓపీఆర్‌డీ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఆరుబయట మల విసర్జనను మాని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement