త్వరలో మెట్రో-3 పనులు | At soon metro-3 works starts | Sakshi
Sakshi News home page

త్వరలో మెట్రో-3 పనులు

May 1 2015 10:56 PM | Updated on Oct 16 2018 5:04 PM

ప్రతిపాదిత ‘కొలాబా-బాంద్రా-సిబ్జ్’ మెట్రో-3 ప్రాజెక్టు పనులు నాలుగైదు నెలల్లో ప్రారంభించే అవకాశం ఉంది...

- ముందుకు సాగించేందుకు ఎంఎంఆర్‌సీ ప్రయత్నాలు
- సలహాదారులతో కమిటీ నియామకం
- బాధితులక నచ్చిన విధంగానే పునరావాసం!
సాక్షి, ముంబై:
ప్రతిపాదిత ‘కొలాబా-బాంద్రా-సిబ్జ్’ మెట్రో-3 ప్రాజెక్టు పనులు నాలుగైదు నెలల్లో ప్రారంభించే అవకాశం ఉంది. కొద్ది నెలలుగా గిర్గావ్-కాల్బదేవి ప్రాంత ప్రజల పునరావసం, గోరేగావ్‌లోని ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్డు నిర్మాణం వివాదాస్పదమయ్యాయి. దీంతో మెట్రో-3 ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. అయితే ఈ సమస్యలు పరిష్కరించేందుకు ముంబై మెట్రో రైల్వే కార్పొరేషన్ (ఎంఎంఆర్‌సీ) యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తోంది. అదేవిధంగా స్టేషన్లు, మెట్రో రైలు మార్గాన్ని భూగర్భ మార్గంలో నిర్మించేందుకు ఆహ్వానించిన టెండర్ల ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. గిర్గావ్ నుంచి కాల్బదేవి ప్రాంతాల్లో ఉంటున్న 650 కుటుంబాల పునరావాస సమస్యను పరిష్కరించేందుకు ఎంఎంఆర్‌సీ సలహదారుల కమిటీని నియమించనుంది.

ఈ కమిటీ ద్వారా పునరావస సమస్య పరిష్కారం కానుంది. ఈ ప్రాంత ప్రజల పునరావస సమస్య అనేక సంవత్సరాల నుంచి పెండింగులో ఉంది. ఇక్కడుంటున్న కుటుంబాలకు నచ్చిన విధంగానే పునరావసం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఎంఎంఆర్‌సీ ఎండీ అశ్విని బిడే తెలిపారు. ముంబైలో మెట్రో రైలు పరుగులు తీసే ప్రాంతాలు, స్టేషన్ పరిసరాలకు ఎంతో డిమాండ్ వస్తుంది. ఇళ్లు, స్థలాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. దీంతో మెట్రో రైలు రాకపోకలు సాగించడానికే కాకుండా అభివృద్థికి కూడా మెట్రో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. స్థానికులకు అక్కడే పునరావసం కల్పించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నట్లు బిడే చెప్పారు. అయినప్పటికీ స్థానికులు ఇష్టపడే చోటే పునరావసం కల్పించడానికి ప్రాధాన్యమిస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement