ఏసీబీ వలలో యూఎల్‌సీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ | Anti-Corruption Bureau raids properties of Visakhapatnam deputy inspector of survey and urban land ceilings | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో యూఎల్‌సీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌

Mar 17 2017 1:15 PM | Updated on Sep 19 2019 2:50 PM

విశాఖపట్నం అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ సర్వే విభాగంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ముమ్మన రాజేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

విశాఖ: విశాఖ అయప్పనగర్‌ ప్రాంతంలో ఉంటున్న విశాఖపట్నం అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ సర్వే విభాగంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ముమ్మన రాజేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో ఐదు ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఇప్పటివరకూ సుమారు రూ. 20 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. 1990లో రూ.1450 ల జీతంతో ఆయన ఉద్యోగంలో చేరారు. అప్పటినుంచి రాజేశ్వరరావు విశాఖలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. 2012-2016 మధ్య కాలం అంటే కేవలం నాలుగేళ్లలో అత్యధికంగా ఆస్తులు సంపాదించినట్టు గుర్తించామని డీఎస్పీ రమాదేవి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement