అనిరుధ్‌కు షాక్ | Anirudh is Out Of Ram Charan's Film | Sakshi
Sakshi News home page

అనిరుధ్‌కు షాక్

Mar 22 2015 2:11 AM | Updated on Aug 28 2018 4:30 PM

అనిరుధ్‌కు షాక్ - Sakshi

అనిరుధ్‌కు షాక్

యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌కు టాలీవుడ్ నిర్మాత షాక్ ఇచ్చారన్నది తాజా సమాచారం.

యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌కు టాలీవుడ్ నిర్మాత షాక్ ఇచ్చారన్నది తాజా సమాచారం. వరుస విజయాలతో కోలీవుడ్‌లో ఎదుగుతున్న సంగీత దర్శకుడు అనిరుధ్. అనిరుధ్ అందించిన వై దిస్ కొలై వెరిడి పాట ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దీంతో టాలీవుడ్ కూడా అనిరుధ్‌పై దృష్టి సారించింది. తెలుగులో రామ్‌చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రానికి అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. అయితే పాటలను సంగీతాన్ని అందించడంలో ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలతో ఆ చిత్ర నిర్మాత అనిరుధ్‌ను చిత్రం నుంచి తప్పించినట్లు సమాచారం. ఈ విషయంలో కథానాయకుడు రామ్‌చరణ్, దర్శకుడు శ్రీనువైట్ల కూడా మౌనం వహించడం అనిరుద్‌కు బాధించిందని సమాచారం. అనిరుధ్ త్వరలో ప్రారంభం కానున్న అజిత్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement