జల్లికట్టుకు మరో చిక్కు | Animal rights groups challenge new TN law on Jallikattu in SC | Sakshi
Sakshi News home page

జల్లికట్టుకు మరో చిక్కు

Jan 25 2017 10:43 PM | Updated on Sep 5 2017 2:06 AM

జల్లికట్టుకు మరో చిక్కు

జల్లికట్టుకు మరో చిక్కు

సంప్రదాయ జల్లికట్టు క్రీడకు మరోసారి న్యాయపరమైన సవాల్‌ ఎదురైంది.

తమిళనాడు చట్టాన్ని సవాల్‌ చేసిన జంతుహక్కుల కార్యకర్తలు
పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం
30న విచారణ


న్యూఢిల్లీ: సంప్రదాయ జల్లికట్టు క్రీడకు మరోసారి న్యాయపరమైన సవాల్‌ ఎదురైంది.  జల్లికట్టును పునరుద్ధరిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయడం, ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి చట్టంగా రూపొందించచడాన్ని సవాల్‌ చేస్తూ జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్ల్యూబీఐ) సహా ఇతర సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరిచింది. ఈ నెల 30వ తేదీన ఏడబ్ల్యూబీఐతోపాటు, ఇతర సంస్థలు దాఖలుచేసిన అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తాం’అని  ధర్మాసనం పేర్కొంది. జల్లికట్టు పేరిట జంతువులను యధేచ్ఛగా హింసిస్తున్నారంటూ అంతర్జాతీయ జంతు కారుణ్య సంస్థ పెటా చేసిన వాదనను సమర్థించిన ధర్మాసనం.

గత ఏడాది చివరిలో ఈ సంప్రదాయ క్రీడను నిషేధించడం తెలిసిందే. అయితే జల్లికట్టు సంక్రాతి(పొంగల్‌) సందర్భంగా నిర్వహించే క్రీడ కావడంతో పండుగ వేళ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మెరీనా బీచ్‌ వేదికగా గతవారం భారీ నిరసనలు జరిగాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం హుటాహుటిన ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఆ మరునాడే అసెంబ్లీలో జల్లికట్టుకు అనుకూలంగా తీర్మానం చేసింది.

                  జల్లికట్టు పోస్టర్‌ వద్ద త్రివర్ణపతాకంలా నిలిచిన చెన్నైలోని ఎవర్‌విన్‌ పాఠశాల విద్యార్థులు

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
జల్లికట్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను సుప్రీం కోర్టు కొట్టివేస్తుందనే అనుమానాల నేపథ్యంలో సుప్రీకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయ కట్జూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టుపై తమిళ సర్కారు జారీచేసిన ఆర్డినెన్స్‌ తాతాలికమైనదేఅయినా, శాసన సభ ఆమోదంతో అది చట్టంగా మారిందని గుర్తుచేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులును సుప్రీంకోర్టులో సవాల్‌చేసే అవకాశం ఉన్నప్పటికీ, రాజ్యాంగంలోని అధికరణ 254(2) ప్రకారం జల్లికట్టు బిల్లుకు రక్షణ లభిస్తుందని, అందువల్ల జల్లికట్టు అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కట్జూ వ్యాఖ్యానించారు

Advertisement
 
Advertisement
Advertisement