షూటింగ్లో హీరోయిన్కి గాయాలు | Alia injures her shoulder | Sakshi
Sakshi News home page

షూటింగ్లో హీరోయిన్కి గాయాలు

Jun 24 2015 9:49 AM | Updated on Sep 3 2017 4:18 AM

షూటింగ్లో హీరోయిన్కి గాయాలు

షూటింగ్లో హీరోయిన్కి గాయాలు

బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కుమార్తె అలియా భట్ షూటింగ్లో గాయపడింది.

చెన్నై : బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కుమార్తె అలియా భట్ షూటింగ్లో గాయపడింది. దీంతో ఆమె భుజానికి గాయమైంది. దాంతో అలియాను కోయింబత్తూరు ఆస్పత్రికి తరలించారు. అయితే స్వల్పంగా గాయపడ్డానని... నొప్పి మాత్రం కొద్దిగానే ఉందని అలియా తెలిపింది. గాయం వల్ల ఒత్తిడికి మాత్రం గురి కాలేదని పేర్కొంది.

రెండు వారాల్లో అంత సర్థుకుంటుందని చెప్పింది. కాగా షూటింగ్ కి మాత్రం డుమ్మాకొట్టకుండా హాజరవుతున్నట్లు అలియా వెల్లడించింది. ఈ మేరకు అలియా ఫోటోబ్లాగ్లో పేర్కొంది. తమిళనాడు నీలగిరి ప్రాంతంలోని కూనూరులో అలియా నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్లో ఆమె గాయపడ్డింది.

Advertisement
 
Advertisement
Advertisement