టీమిండియాతో సిరీస్‌.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్‌ | New Zealand Suffer Major Injury Blow Ahead Of Series vs India | Sakshi
Sakshi News home page

IND vs NZ: టీమిండియాతో సిరీస్‌.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్‌

Oct 10 2026 12:24 PM | Updated on Oct 10 2026 12:45 PM

New Zealand Suffer Major Injury Blow Ahead Of Series vs India

స్వదేశంలో భారత్‌తో జరగనున్న మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్  విల్ ఓ'రూర్క్ గాయం కారణంగా టీ20లతో పాటు వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. రూర్క్ ప్ర‌స్తుతం కాలి కండరాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. 

ఈ విష‌యాన్ని కివీస్ హెడ్‌కోచ్ రాబ్ వాల్టర్ ధ్రువీక‌రించాడు. డిసెంబర్ ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ నాటికి ఓ'రూర్క్ పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి వస్తాడని వాల్టర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

భార‌త్‌తో జ‌రిగే ప్ర‌తిష్టాత్మ‌క సిరీస్‌కు ఓ రూర్క్ దూరం కావ‌డం మమ్మ‌ల్ని తీవ్ర నిరాశ‌ప‌రిచింది. అయితే అత‌డు ప్ర‌స్తుతం రెండు గాయాల‌తో బాధ‌ప‌డుతున్నాడు. అత‌డు పూర్తిగా కోలుకోవ‌డానికి మ‌రింత స‌మ‌యం ఇవ్వాల‌ని నిర్ఱ‌యించాం. ఈ సిరీస్ త‌ర్వాత ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు ఆడ‌నున్నాం. ఆ సిరీస్ నాటికి ఓ రూర్క్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని భావిస్తున్నాను అని వాల్ట‌ర్ పేర్కొన్నాడు.

కాగా 25 ఏళ్ల ఓ రూర్క్‌కు టెస్టుల్లో అద్భుత‌మైన రికార్డు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 14 టెస్టులు మాత్ర‌మే ఆడిన ఓరూర్క్‌..  49 వికెట్లు సాధించాడు. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన సిరీస్‌లో అత‌డు 10 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అయితే ఆ సిరీస్‌లోని చివరి టెస్టులో అత‌డు కాలి కండరాల గాయానికి గుర‌య్యాడు. అప్ప‌టి నుంచి అత‌డు ఆట‌కు దూరంగా ఉంటున్నాడు. అంతకుముందు వెన్నునొప్పి కారణంగా ఏడు నెలల పాటు అత‌డు ఆట‌కు దూరంగా ఉన్నాడు.

కివీస్‌కు గాయాల బెడ‌ద‌..
కాగా భారత్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా అక్టోబర్ 22 నుంచి ఐదు టీ20ల సిరీస్‌తో పాటు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందు కివీస్‌ను గాయాల బెడద వెంటాడుతోంది.  ఓ'రూర్క్‌తో పాటు మార్క్ చాప్‌మ‌న్‌,  జాక్ ఫౌల్కేస్ కూడా టీ20ల‌కు దూర‌మ‌య్యారు.
చదవండి: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అత్యద్భుతం: శ్రేయస్‌ అయ్యర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement