నల్లగొండ : నల్లగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది చెన్నై షాపింగ్ మాల్’ శుక్రవారం ప్రారంభమైంది.
ప్రముఖ సినీ నటి రితికా నాయక్ చేతులు మీదుగా ప్రారంభోత్సవ వేడుక సందడిగా సాగింది.
మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్‌డబ్ల్యూసీ కోర్ర లక్ష్మి, షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ మర్రి వెంకట్‌రెడ్డి, డైరెక్టర్ కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ యామా కవితా దయాకర్‌లతో కలిసి నటి రితికానాయక్ జ్యోతి ప్రజ్వలన చేశారు.
నటి రితికాను చూసేందుకు యువకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.


