PC: BCCI/X
సొంతగడ్దపై టీమిండియాతో మల్టీఫార్మాట్ సిరీస్‌లకు ముందు న్యూజిలాండ్ జట్టు కోచింగ్ స్టాప్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ బీజే వాట్లింగ్‌ను తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా కివీస్ క్రికెట్ బోర్డు నియమించింది. అదేవిధంగా భారత్‌తో టెస్టు సిరీస్ తర్వాత ల్యూక్ రోంచి న్యూజిలాండ్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగనున్నాడు. అతడి స్దానంలో బ్రాడ్లీ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
వాట్లింగ్ కూడా భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ సపోర్ట్ స్టాప్‌లో చేరి రోంచితో కలిసి పనిచేయనున్నాడు. కానీ అధికారికంగా డిసెంబర్‌లో కివీస్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు అతడు బాధ్యతలు తీసుకోనున్నాడు. 41 ఏళ్ల వాట్లింగ్‌కు క్రికెటర్‌గా, కోచ్‌గా మంచి అనుభవం ఉంది.
నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ , వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ కోచ్‌గా అతడు పనిచేశాడు. ఇప్పుడు జాతీయ జట్టు కోచింగ్ విభాగంలో చేరే అవకాశమచ్చినందుకు సంతోషంగా ఉంది అని వాట్లింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. వాట్లింగ్ కివీస్ తరపున 75 టెస్టులు, 28 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కాగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలుత 5 టీ20ల సిరీస్ అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.
చదవండి: జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్


