బిందుమాధవికి లక్కీచాన్స్ | Ajith to romance Shruti Haasan and Bindu Madhavi in Thala | Sakshi
Sakshi News home page

బిందుమాధవికి లక్కీచాన్స్

Mar 1 2015 1:34 AM | Updated on Sep 2 2017 10:05 PM

బిందుమాధవికి లక్కీచాన్స్

బిందుమాధవికి లక్కీచాన్స్

యువ నటి బిందుమాధవికి బంపర్ ఆఫర్ వరించింది. నిజం చెప్పాలంటే ఇలాంటి ఒక అవకాశం కోసం ఈ బ్యూటీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు.

యువ నటి బిందుమాధవికి బంపర్ ఆఫర్ వరించింది. నిజం చెప్పాలంటే ఇలాంటి ఒక అవకాశం కోసం ఈ బ్యూటీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. కేడి బిల్లా కిల్లాడి రంగా వంటి రెండు మూడు చిత్రాలు ఈ తెలుగమ్మాయి ఖాతాలో హిట్‌గా నిలిచినా అవన్నీ చిన్న హీరోల సరసన నటించిన చిత్రాలే. దీంతో బిందుమాధవి స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయారు. తెలుగులో కూడా ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశాల్ని బిందుమాధవి రాబట్టు కోలేకపోయారనే చెప్పాలి. తాజాగా అజిత్ సరసన నటించే లక్కీచాన్స్‌ను బిందుమాధవి కొట్టేశారు.
 
 ఎన్నై అరిందాల్ వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత అజిత్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఇంతకుముందు వీరం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన శివ దర్శకత్వం వహించనున్నారు. విశేషం ఏమిటంటే అజిత్ శ్రీ సాయిరామ్ ఫిలింస్ సంస్థ పర్మనెంట్ హీరో అయిపోయారనిపిస్తోంది. వరుసగా ఆ సంస్థకే చిత్రాలు చేస్తున్నారు.
 
 ఇంతకుముందు ఆరంభం, ఇటీవల ఎన్నై అరిందాల్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన శ్రీ సాయిరామ్ ఫిలింస్ అధినేత ఏఎం రత్నం అజిత్ నటించనున్న తాజా చిత్రానికి నిర్మాత కావడం విశేషం. కాగా ఇందులో  పలువురు క్రేజీ నటీమణులు పేర్లు పరిశీలించిన చిత్ర యూనిట్ చివరికి నటి శ్రుతిహాసన్‌ను ఎంపిక చేశారు. ఇక మరో నాయికగా నటించే అదృష్టం నటి బిందుమాధవిని వరించింది. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చిత్ర షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపారు. ఇందులో అజిత్ గెటప్ చాలా కొత్తగా ఉంటుందంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement