breaking news
Bindu Madhav
-
పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందు మాధవ్, అమిత్ బర్దర్‌లను సస్పెండ్ చేయగా తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌ను బదిలీ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. పల్నాడు కలెక్టర్ శివశంకర్‌ను సైతం బదిలీ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టాలని సూచించింది. అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన 12 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ నిర్వహించాలని పేర్కొంది. హింస చెలరేగేందుకు కారకులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. బాధ్యులపై ఎన్నికల ప్రవర్తనా నియామవళి ప్రకారం చార్జీషీట్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా గురువారం ఢిల్లీ వెళ్లి ఎన్నికల వేళ చెలరేగిన హింసపై స్వయంగా వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని, కౌంటింగ్ రోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఓట్ల లెక్కింపు అనంతరం 15 రోజులపాటు బందోబస్తు విధులు నిర్వహించేందుకు 25 కంపెనీల అదనపు బలగాలను పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.ఈసీ సస్పెండ్ చేసిన పోలీసులు వీరేతిరుపతి జిల్లాఎ.సురేందర్‌రెడ్డి డీఎస్పీ–తిరుపతికె.రాజశేఖర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఎం.భాస్కర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీఒ.రామచంద్రారెడ్డి ఇన్స్పెక్టర్–అలిపిరిపల్నాడు జిల్లాఎ.పల్లపురాజు ఎస్డీపీవో–గురజాలవీఎస్ఎన్ వర్మ ఎస్డీపీవో–నరసరావుపేటకె.ప్రభాకర్‌రావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఇ.బాలనాగిరెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఎం.రామాంజినేయులు ఎస్సై–కారంపూడిడి.వి.కొండారెడ్డి ఎస్సై–నాగార్జునసాగర్అనంతపురం జిల్లాసి.ఎం. గంగయ్య డీఎస్పీ–తాడిపత్రిఎస్. మురళీకృష్ణ ఇన్స్పెక్టర్–తాడిపత్రి -
బిందుమాధవికి లక్కీచాన్స్
యువ నటి బిందుమాధవికి బంపర్ ఆఫర్ వరించింది. నిజం చెప్పాలంటే ఇలాంటి ఒక అవకాశం కోసం ఈ బ్యూటీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. కేడి బిల్లా కిల్లాడి రంగా వంటి రెండు మూడు చిత్రాలు ఈ తెలుగమ్మాయి ఖాతాలో హిట్‌గా నిలిచినా అవన్నీ చిన్న హీరోల సరసన నటించిన చిత్రాలే. దీంతో బిందుమాధవి స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయారు. తెలుగులో కూడా ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశాల్ని బిందుమాధవి రాబట్టు కోలేకపోయారనే చెప్పాలి. తాజాగా అజిత్ సరసన నటించే లక్కీచాన్స్‌ను బిందుమాధవి కొట్టేశారు. ఎన్నై అరిందాల్ వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత అజిత్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఇంతకుముందు వీరం వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన శివ దర్శకత్వం వహించనున్నారు. విశేషం ఏమిటంటే అజిత్ శ్రీ సాయిరామ్ ఫిలింస్ సంస్థ పర్మనెంట్ హీరో అయిపోయారనిపిస్తోంది. వరుసగా ఆ సంస్థకే చిత్రాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఆరంభం, ఇటీవల ఎన్నై అరిందాల్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన శ్రీ సాయిరామ్ ఫిలింస్ అధినేత ఏఎం రత్నం అజిత్ నటించనున్న తాజా చిత్రానికి నిర్మాత కావడం విశేషం. కాగా ఇందులో పలువురు క్రేజీ నటీమణులు పేర్లు పరిశీలించిన చిత్ర యూనిట్ చివరికి నటి శ్రుతిహాసన్‌ను ఎంపిక చేశారు. ఇక మరో నాయికగా నటించే అదృష్టం నటి బిందుమాధవిని వరించింది. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చిత్ర షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపారు. ఇందులో అజిత్ గెటప్ చాలా కొత్తగా ఉంటుందంటున్నారు.