ఆర్థిక సంక్షోభంలో వ్యవసాయ వర్సిటీ | agriculture university was in financial crisis | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంక్షోభంలో వ్యవసాయ వర్సిటీ

Jan 1 2014 2:05 AM | Updated on Sep 2 2017 2:09 AM

రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి వర్సిటీ అధికారులు ఉన్నారు.

 రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ :
 రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.  బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి  వర్సిటీ అధికారులు ఉన్నారు.  ప్రణాళికేతర నిధులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వ క పోవడంతో ఈ పరిస్థితి దాపురించినట్లు తెలుస్తోంది. దాదాపుగా ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వక పోవడంతో  బోధకులు, బోధనేతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలు ఇవ్వకపోవడంతో  కుటుంబాలను పోషించడమే కష్టసాధ్యంగా మారిందని పేరు చెప్పేందుకు ఇష్టపడని సిబ్బంది న్యూస్‌లైన్ వద్ద వాపోయారు. మరో వైపు నిధుల లేమితో   వర్సిటీ అభివృద్ధి కుంటు పడింది. కొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు.
 
  ఈ విషయపై వీసీ బీవీ.పాటిల్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగడా గత ఏడాది ప్రభుత్వం రూ.26 కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ.16 కోట్లు మాత్రమే విడుదల చేసిం దన్నారు. ఈ విషయాన్ని  సీఎం సిద్ధరామయ్య, వ్యవసాయశాఖ మంత్రి భౌరెగౌడ దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదల చేయాలని కోరుతామన్నారు.  ప్రణాళికేతర వ్యయానికి రూ.38 కోట్లను కేటాయించాలని కోరనున్నట్లు తెలిపారు. గుల్బర్గా వ్యవసాయ కళాశాలలో విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ రూ.2.50 కోట్లను విడుదల చేసిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement