కేసు వెనుక చంద్రచూడ్ హస్తం : నటి శ్రుతి | Actress Shruthi Denies Allegations of assaulting maidservant | Sakshi
Sakshi News home page

కేసు వెనుక చంద్రచూడ్ హస్తం: నటి శ్రుతి

Jun 20 2014 8:06 AM | Updated on Mar 29 2019 9:07 PM

కేసు వెనుక చంద్రచూడ్ హస్తం : నటి శ్రుతి - Sakshi

కేసు వెనుక చంద్రచూడ్ హస్తం : నటి శ్రుతి

పని మనిషితో తన మాజీ రెండవ భర్త, జర్నలిస్ట్ చంద్రచూడ్ తప్పుడు కేసు పెట్టించారని బహుభాష నటి, బీజేపీ నాయకురాలు శ్రుతి ఆరోపించారు.

బెంగళూరు : పని మనిషితో తన మాజీ రెండవ భర్త, జర్నలిస్ట్ చంద్రచూడ్ తప్పుడు కేసు పెట్టించారని బహుభాష నటి, బీజేపీ నాయకురాలు శ్రుతి ఆరోపించారు. గురువారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో తన ఇంటిలో పని చేసిన శోభ, చంద్రచూడ్ ఇంటిలోనూ పని చేస్తోందని తెలిపారు. తన వ్యక్తిగత జీవితంపై చెడుగా ప్రచారం చేయడానికి చంద్రచూడ్ శోభతో కలిసి పథకం వేశారని శ్రుతి ఆరోపించారు.

అందులో భాగంగానే శోభ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కేసు పెట్టిందన్నారు. చదవడమే రాని శోభ తనపై ఇన్ని ఆరోపణలు చేస్తూ కేసు ఎలా పెట్టిందోనని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తులో నిజాలు వెలుగు చూస్తాయని శ్రుతి ధీమా వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement