
ఇక కోలీవుడ్ పైనే దృష్టి
ఇకపై కోలీవుడ్ పైనే ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు నటుడు అజ్మల్ అమీర్ పేర్కొన్నారు. కథానాయకుడిగా అయినా..
ఇకపై కోలీవుడ్ పైనే ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు నటుడు అజ్మల్ అమీర్ పేర్కొన్నారు. కథానాయకుడిగా అయినా..ప్రతినాయకుడిగానయినా పాత్రగా మారిపోయే నటుల్లో అజ్మల్ ఒకరని చెప్పవచ్చు. తురుతురు తిరుతిరు లాంటి చిత్రాలలో హీరోగా నటించి పేరు తెచ్చుకున్న ఈ యువ నటుడు అంజాదే, కో వంటి చిత్రాల్లో ప్రతినాయకుడిగానూ తన సత్తా చాటుకున్నారు. అలా, తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు సంపాధించుకున్న అజ్మల్ నటుడిగా తనను విస్తరించుకునే ప్రయత్నంలో భాగంగా తెలుగు, మలయాళ చిత్రాలపై దృష్టి సారించారు.
తెలుగులో రెండు చిత్రాలు, మలయాళంలో కొన్ని చిత్రాలు చేసి మంచి పేరు పొందారు. దీంతో సహజంగానే తమిళంలో కొంచెం గ్యాప్ వచ్చిందంటారు అజ్మల్. ఆయన మాట్లాడుతూ మలయాళంలో ఒక చిత్రంలో మోహన్‌లాల్‌తో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. అయితే ఇతర భాషల్లో నటిస్తున్నా కోలీవుడ్‌లో రాణించాలన్నదే తన ఆశ అని అన్నారు. అందుకే ఇప్పుడు చెన్నైలో సెట్టిల్ అయినట్లు పేర్కొన్నారు. ఇక తమిళ చిత్రాలపైనే దృష్టి సారించనున్నట్టు చెప్పారు. ఇక్కడ మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తునట్లు అజ్మల్ వెల్లడించారు.