ఆప్ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు | AAP legislator Amanatullah Khan granted bail | Sakshi
Sakshi News home page

ఆప్ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు

Sep 22 2016 2:55 PM | Updated on Jul 23 2018 8:49 PM

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు గురువారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనతో సంబంధం పెట్టుకోవాలని ఎమ్మెల్యే ఒత్తిడికి గురి చేస్తున్నాడ‌ంటూ ఆయన బావమరిది భార్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఖాన్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు.

దీంతో ఎమ్మెల్యేకు ఒక్కరోజు పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మరోవైపు ఎమ్మెల్యే తరఫు న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కాగా తనపై ఆరోపణలతో ఎమ్మెల్యే అమానతుల్లా ఆదివారం  జమియా నగర్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే ఆయనను తమ దర్యాప్తు ప్రకారమే అరెస్టు చేస్తామ‌ని పోలీసులు అక్క‌డి నుంచి పంపించి వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement