14 ఏళ్లుగా తేనీరే ఆహారం

75 Years Old Women Living By Drinking TEA Since 14 Years - Sakshi

సాక్షి, రాయచూరు : ఆరోగ్యం సహకరించకున్నా రకరకాల వంటకాలు తినాలని నాలుక ఉవ్విళ్లూరుతుంటుంది. కానీ ఓ మహిళ కేవలం టీతో ఆకలిని చల్లార్చుకుంటోంది. 14 ఏళ్ల కిందట కుమారుడు మరణించగా, ఆనాటి నుంచి టీ తప్ప మరేమీ తీసుకోవడం లేదు. కర్ణాటకలో విజయపుర జిల్లా తాళికోటె తాలూకా సాసనూరుకు చెందిన శాంతమ్మ బిరాదార్‌ (75)కు ముగ్గురు ఆడపిల్లలు, కొడుకు ఉన్నారు. కొడుకు, భర్త చనిపోయిన తర్వాత జీవితంపై విరక్తి పెంచుకుంది. టీ తాగుతూ కాలం వెళ్లదీస్తోంది. చిన్న మఠంలో ఉంటున్న ఆమె అన్నం ముట్టదు. కుటుంబీకులు వైద్యుల వద్ద చూపించగా, ఆమె ఆరోగ్యం బాగుందని తేల్చారు. భోజనం చేయాలని వైద్యులు సూచించినా ఆమె మాత్రం రోజుకు 4 సార్లు టీ తాగుతూ ఆకలిని జయిస్తోంది. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top