నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో శనివారం ఆరుకిలోల బరువుతో శిశువు జన్మించింది.
6 కిలోల శిశువు జననం
Sep 3 2016 4:24 PM | Updated on Sep 4 2017 12:09 PM
హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో శనివారం ఆరుకిలోల బరువుతో శిశువు జన్మించింది. బోరబండకు చెందిన షబానా అనే మహిళ ఆరు కిలోల మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని శస్త్ర చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. పుట్టిన బిడ్డ ఆరు కిలోల బరువు ఉండటం అరుదైన ఘటన అని వైద్యులు అంటున్నారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 6 కేజీల బరువుతో శిశువు పుట్టడం అరుదైన విషమన్నారు.
Advertisement


