అనుమతులు లేని వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు.
30 ఓవర్ లోడ్ వాహనాలు సీజ్
Oct 29 2016 2:00 PM | Updated on Sep 4 2017 6:41 PM
వరంగల్: అనుమతులు లేని వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. ఓవర్‌లోడుతో పాటు అనుమతి పత్రాలు లేకుండా సరుకులు రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీలు చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా ఖిల్లావరంగల్ మండల పరిధిలో శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ, విజిలెన్స్ అధికారులు పరిమితికి మించి లోడును తీసుకెళ్తున్న 30 లారీలను సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు.
Advertisement


