రవాణా శాఖ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గత మూడు రోజులుగా 350కి పైగా వివిధ వాహనాలపై కేసులు నమోదు చేస్తే అందులో 60కి పైగా ఓవర్ లోడ్‌తో ఉన్నాయని రవాణా శాఖ తెలిపింది. ఇప్పటికే 33 జిల్లాల రవాణా శాఖ అధికారులకు ఓవర్ లోడ్ వాహనాలపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలియజేసింది. త్వరలో మైనింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వాహనాలకు లోడ్ వేసే రీచ్‌లు, క్వారీలలోనే ఓవర్ లోడ్‌ను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో పేర్కొంది.
2025 జనవరి 1 నుంచి నవంబర్ 6 వరకు మోటారు వాహనాల చట్టాలను ఉల్లంఘించిన 1,15,000కు పైగా వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. వీటిలో 5 వేలకుపైగా ఓవర్ లోడ్‌తో వాహనాలు, 9వేలకు పైగా ప్రైవేట్ బస్సులు ఉన్నాయని వివరించింది. పరి్మట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని వాహనాలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపింది.


