విహారయాత్రలో అపశ్రుతి | 25 students injured in bus accident at kurnool district | Sakshi
Sakshi News home page

విహారయాత్రలో అపశ్రుతి

Dec 20 2016 4:27 PM | Updated on Nov 9 2018 4:44 PM

విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది.

- బస్సు బోల్తా
-25 మంది విద్యార్థులకు గాయాలు
 
కోవెలకుంట్ల: విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు అనంతపురం జిల్లా నుంచి బయలుదేరిన విహారయాత్ర బస్సు  రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 25 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ముగ్గురు విద్యార్థినులు, ఇద్దరు ఉపాధ్యాయుల పరిస్థితి విషమంగా ఉంది. సంజామల ఎస్‌ఐ విజయభాస్కర్, గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు వివరాలు... జిల్లాలోని అహోబిల్, బెలుం గుహలు, మహానంది, శ్రీశైలం, యాగంటి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం ఉడ్డేగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 68 మంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంగళవారం ఉదయం బయలుదేరారు. పేరుసోమల-ఆల్వకొండ ఆర్‌అండ్ బీ రహదారి గుండా అహోబిలం వెళుతుండగా సంజామల మండలం రెడ్డిపల్లి సమీపంలోని ఈద్గా మలుపు వద్ద బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనను తెలుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్థుల

 

Advertisement
 
Advertisement
Advertisement