అధికారుల తనిఖీలు: 25 కిలోల వెండి స్వాధీనం | 25 kg silver seized in tamilnadu | Sakshi
Sakshi News home page

అధికారుల తనిఖీలు: 25 కిలోల వెండి స్వాధీనం

May 11 2016 8:34 AM | Updated on Sep 3 2017 11:53 PM

రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులు జరిపిన తనిఖీల్లో రూ.4.39 కోట్ల నగదు, 28 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

కేకే.నగర్: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులు జరిపిన తనిఖీల్లో రూ.4.39 కోట్ల నగదు, 28 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
 
టి.నగర్‌లో రూ.3.58 లక్షల స్వాధీనం: ఓటర్లకు డబ్బులు పంచడానికి దాచి ఉంచిన రూ.3.58 కోట్లను ఆదాయశాఖ అధికారులు నందనం సీఐటీ నగర్ పారిశ్రామిక వేత్త ఇంట్లో సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. టి.నగర్ నియోజకవర్గం నందనం సీఐటీ నగర్‌లోని పారిశ్రామికవేత్త ఓటర్లకు డబ్బులు ఇస్తున్నట్లు అధికారులకు రహస్య సమాచారం అందిం ది. తనిఖీ చేసిన అధికారులు సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు.
 
 రూ.40 లక్షల స్వాధీనం : మడిపాక్కం పొన్నియమ్మన్ కోవిల్ సమీపం లో నివసిస్తున్న 169వ వార్డు అన్నాడీఎంకే కౌన్సిలర్ జయచంద్రన్ ఇంట్లో అధిక మొత్తంలో డబ్బులు దాచి ఉంచినట్లు అధికారులకు సమాచారం అందింది. ఎన్నికల అధికారి సెంథిల్‌వేల్ సోదాలు జరిపి రూ.40 38లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
 
 అన్నానగర్‌లో: అన్నానగర్ నియోజ కవర్గం టి.పి.సత్రం జ్యోతి అమ్మల్‌నగర్ 23వ వీధిలో అన్నాడీఎంకే వార్డు కౌన్సిలర్ కుప్పుస్వామి కుమార్తె సెల్వి ని పోలీసులు అరెస్టు చేశారు.  ఓటు వే యాలని రూ. 500లను పంచుతుండగా అధికారులు ఆమెను అడ్డుకున్నారు. టి.పి.సత్రం పోలీసులు సెల్వి, వెల్లచ్చిలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్ళారు.
 
 రూ.41 లక్షలు స్వాధీనం :మంగళవారం ఉదయం పుదుచ్చేరి కారామణికుప్పం ప్రాంతంలో ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులు జరిపిన  తనిఖీలలో రూ. 41 లక్షల డబ్బు పట్టుబడింది. ఏటీఎంలలో నింపడానికి బ్యాంకు నుంచి తెస్తున్నట్లు చెప్పినా సరైన ఆధారాలు లేకపోవడంతో నగదు, జీపును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
 25 కిలోల వెండి స్వాధీనం :
 దిండివనం సెంజి నియోజకవర్గంలో కా రులో తీసుకెళుతున్న 25 కిలోల వెండి వస్తువులను అధికారులు మంగళవారం ఉ దయం స్వాధీనం చేసుకున్నారు. శివకాపురం నుంచి చెన్నైకు వెళుతున్న కారులో వెండిని స్వాధీనం చేసుకున్నారు.
 
 మదురైలో అన్నాడీఎంకే, డీఎంకే ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు
 దిండుకల్ జిల్లాలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు చెందిన ప్రముఖుల ఇళ్లల్లో అధికారులు సోదాలు జరిపారు.  ఒకే రోజు డీఎంకే, అన్నాడీఎంకేకు చెందిన ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరపడం ప్రజలు, పార్టీ వర్గాల మధ్య సంచలనం రేకెత్తించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement