కడప నగరంలోని జువెనైల్ హోంలో రెండు రోజుల క్రితం జరిగిన హత్యకు సంబంధించి రాష్ట్ర చెరైక్టర్ శారద శనివారం విచారణ ప్రారంభించారు.
కడప క్రైం: కడప నగరంలోని జువెనైల్ హోంలో రెండు రోజుల క్రితం జరిగిన హత్యకు సంబంధించి రాష్ట్ర చెరైక్టర్ శారద శనివారం విచారణ ప్రారంభించారు. ప్రత్యేక పరిశీలన గృహంలో ఉంటున్న ముస్తఫా తోటి బాలుడి తో జరిగిన గొడవ నేపథ్యంలో దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారిణి శారద శనివారం ప్రత్యేక వసతి గృహంలో విచారణ చేపట్టారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న బాలురతో పాటు సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలటంతో హెడ్ సూపర్‌వైజర్ సుబ్రహ్మణ్యం, సూపర్‌వైజర్ పురుషోత్తంరెడ్డి, బలరామరాజు, వరప్రకాశ్‌ను సస్పెండ్ చేశారు. కాగా, ఈ హోంలో ఏడుగురు ఆశ్రయం పొందుతున్నారు.