గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు: బాలుడి మృతి | 1 died in gas cylinder blast in vizianagaram district | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు: బాలుడి మృతి

May 11 2017 1:14 PM | Updated on Jul 12 2019 3:02 PM

విజయనగరం జిల్లాలోని బాడంగి మండలం ఎరుకులపాకలో విషాద సంఘటన చోటు చేసుకుంది.

విజయనగరం: విజయనగరం జిల్లాలోని బాడంగి మండలం ఎరుకులపాకలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఓ ఇంట్లో గురువారం మధ్యాహ్నం గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. పేలుడు ధాటికి ఇళ్లు కూలిపోవడంతో పాటు పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో ఇంట్లో ఉన్న వేణు(10) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement