ధోనిపై పాక్‌ మాజీ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు

Zaheer Abbas Says Dhoni is The Brain of Indian Cricket Team - Sakshi

ఇస్లామాబాద్‌ : టీమిండియా మాజీ సారథి, సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోనిపై పాకిస్తాన్‌ దిగ్గజ సారథి జహీర్‌ అబ్బాస్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో ధోని రాణించడంపైనే టీమిండియా గెలుపోటములు ఆధారపడి ఉన్నాయన్నాడు. అతడి అనుభవం కోహ్లి సేనకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియా సమతూకంతో ఉందని, ఒత్తిడిలో కూడా రాణించగల ధోని ఉండటం అదనపు బలమని వివరించాడు.
ధోని.. బ్రెయిన్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌
‘టీమిండియాలో ధోని అనే మేధావి ఉన్నాడు. అతడే బ్రెయిన్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌. ధోని అనుభవమే ప్రపంచకప్‌లో టీమిండియాను గెలిపిస్తుంది. సారథిగా, కోచ్‌గా, వ్యూహకర్తగా ధోని జట్టును సమర్థవంతంగా నడిపించగలడు. ఇక కోహ్లి కూడా తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిన సమయమిది. ఐసీసీ లాంటి మెగా టోర్నీలను జట్టుకు అందిస్తేనే సారథిగా విజయవంతమైనట్టు. కోహ్లికి ముందున్న లక్ష్యం టీమిండియాకు ప్రపంచకప్‌కు అందించడమే

450 చూస్తాం..
ప్రస్తుతం ఇంగ్లండ్‌ పిచ్‌లు బ్యాటింగ్‌కు స్వర్గధామంగా మారాయి. భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. పాకిస్తాన్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన సిరీస్‌లో అలవోకగా 300కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. ప్రపంచకప్‌లో 450పైకి పైగా పరుగులు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్‌పై సిరీస్‌ ఓటమితో పాక్‌ కుంగిపోవాల్సిన అవసరం లేదు. పాక్‌ ఆటగాళ్లు ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. ప్రపంచకప్‌లో ఏమైనా జరగవచ్చు. ఏ జట్టైనా గెలవొచ్చు’అంటూ అబ్బాస్‌ పేర్కొన్నాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top