సిక్సర్ల సింగ్‌కు డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ స్పెషల్‌ మెసేజ్‌ | On Yuvraj Singh's Birthday, Virender Sehwag's Very Special Message | Sakshi
Sakshi News home page

సిక్సర్ల సింగ్‌కు డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ స్పెషల్‌ మెసేజ్‌

Dec 12 2017 3:41 PM | Updated on May 28 2018 2:10 PM

On Yuvraj Singh's Birthday, Virender Sehwag's Very Special Message - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  నేటితో 37వ ఏట అడుగెడుతున్న టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌, సిక్సర్ల హీరో యువరాజ్‌ సింగ్‌కు సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక ప్రతి ఒక్కరి బర్త్‌డే ప్రత్యేకంగా విషెస్‌ చెప్పే మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ యువీకి సైతం తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

ఏ బీ సీ డీ.. జెడ్‌ల్లో ‘యూవీ’ కనబడదు. ఎందుకంటే యూవీ ఒక్కడే. హ్యాపీ బర్త్‌డే మిత్రమా.. నీవు ఇలా ముందుకు సాగుతూ.. మరింత మందికి స్పూర్తిని కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అని ట్వీట్‌ చేశాడు. ఇక సహచర క్రికెటర్లంతా తన పోరాటపటిమను, కష్టపడే తత్వాన్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

అనుక్షణం మాలో పోరాటతత్వాన్ని అలవరిచిన వాడివి. ఎన్నోసార్లు నీ అద్భుత ప్రదర్శనతో మమ్మల్నందరినీ గర్వంగా తలెత్తుకునేలా చేసిన నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. యువీ.. దేవుడు నిన్ను దీవించుగాక.- సురేశ్‌ రైనా

నీ సంకల్ప శక్తితో స్పూర్తిని కలిగిస్తూ.. పోరాటపటిమను రగిలించిన యువీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీవు మరింత ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా- వీవీఎస్‌ లక్ష్మణ్‌

నా జీవితంలో నాకు స్పూర్తిని కలిగించిన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. యువీ ఈ ఏడాది నీవు ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నా- మహ్మద్‌ కైఫ్‌

 పెద్దన్నకు పుట్టి రోజు శుభాకాంక్షలు.. ఈ ఏడాది నీ జీవితంలో గొప్పది కావలని ఆశిస్తున్నా.- శిఖర్‌ ధావన్‌ 

హ్యాపీ బర్త్‌డే యువీ పాజీ. ఈ ఏడాది నీవు మరిన్ని విజయాలు అందుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.- జస్ప్రీత్‌ బుమ్రా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement