యువరాజ్ సింగ్కు ఉద్వాసన | Yuvraj Singh dropped; Ishwar Pandey, Stuart Binny get nod for New Zealand tour | Sakshi
Sakshi News home page

యువరాజ్ సింగ్కు ఉద్వాసన

Dec 31 2013 3:53 PM | Updated on Oct 8 2018 3:28 PM

యువరాజ్ సింగ్కు ఉద్వాసన - Sakshi

యువరాజ్ సింగ్కు ఉద్వాసన

వరుసగా విఫలమవుతున్న సీనియర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్కు సెలెక్షన్ కమిటీ షాక్ ఇచ్చింది.

న్యూఢిల్లీ: వరుసగా విఫలమవుతున్న సీనియర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్కు సెలెక్షన్ కమిటీ షాక్ ఇచ్చింది. వన్డే జట్టు నుంచి అతడికి ఉద్వాసన పలికింది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును సెలెక్షన్ కమిటీ నేడు ఎంపిక చేసింది. యువరాజ్ సింగ్కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో కర్ణాటక ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులోకి వచ్చాడు. బౌలర్ మొహిత్ శర్మకు మొండిచేయి చూపారు. అతడి స్థానంలో పేసర్ వరుణ్ ఆరోన్ను తీసుకున్నారు. మధ్యప్రదేశ్ సీమర్ ఈశ్వర్ పాండే 'డబుల్' సాధించాడు. వన్డే, టెస్టు టీమ్లో అతడు చోటు సంపాదించాడు. స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు.

టెస్టు టీమ్: ధోనీ(కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, పూజారా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, అశ్విన్, ఉమేష్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, ఈశ్వర్ పాండే

వన్డే టీమ్: ధోనీ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రహానే, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, అశ్విన్, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, ఈశ్వర్ పాండే

Advertisement
 
Advertisement
Advertisement