రెజ్లర్‌ రవి కుమార్‌కు రజతం | Wrestler Ravi Kumar in final World Championship | Sakshi
Sakshi News home page

రెజ్లర్‌ రవి కుమార్‌కు రజతం

Nov 19 2018 1:59 AM | Updated on Nov 19 2018 2:12 AM

Wrestler Ravi Kumar in final  World Championship - Sakshi

ప్రపంచ అండర్‌–23 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ రవి కుమార్‌ రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. రొమేనియాలోని బుకారెస్ట్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల ఫ్రీస్టయిల్‌ 57 కేజీల విభాగం ఫైనల్లో రవి 0–6తో జపాన్‌కు చెందిన తొషిహిరో హసెగవా చేతిలో ఓడిపోయాడు. ఈ ఈవెంట్‌ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ రెజ్లర్‌గా రవి గుర్తింపు పొందాడు. 2017లో బజరంగ్‌ పూనియా (65 కేజీలు), ఓంప్రకాశ్‌ (70 కేజీలు) కూడా రజత పతకాలే సాధించారు.    

Advertisement
 
Advertisement
Advertisement