శతక్కొట్టిన వార్నర్.. పాక్‌ లక్ష్యం 308

World Cup 2019 Australia Set 308 Runs Target For Pakistan - Sakshi

అమిర్‌ పాంచ్‌ పటాకా

చివర్లో తడబడిన ఆసీస్‌

టాంటన్‌: ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రపంచకప్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తునే ఉన్నాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అర్దసెంచరీతో రాణించిన వార్నర్‌ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. దీంతో బుధవారం స్థానిక మైదానంలో జరగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు 308 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ నిర్దేశించింది. ఆసీస్‌ ఆటగాళ్లలో వార్నర్‌(107; 111 బంతుల్లో 11ఫోర్లు, 1 సిక్సర్‌) శతకం సాధించగా.. ఫించ్‌(82; 84 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. పాక్‌ బౌలర్లలో అమిర్‌(5/30), షాహిన్‌ ఆఫ్రిది(2/70)లు రాణించారు.
అమిర్‌ ఆగయా..
ఆసీస్‌ను భారీ స్కోర్‌ చేయకుండా ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ అమిర్ అడ్డుకున్నాడు ‌. ప్రమాదకరంగా మారుతున్న ఓపెనింగ్‌ జోడిని ఔట్‌ చేసి తన వికెట్ల వేటను ప్రారంభించాడు. అనంతరం షాన్‌ మార్స్(23)‌, ఉస్మాన్‌ ఖవాజా(18), అలెక్స్‌ కేరీ(20)లను ఔట్‌ చేసి మిడిలార్డర్‌ను కూలగొట్టి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వరుస విరామంలో వికెట్లు తీస్తూ డిఫెండింగ్‌ చాంపియన్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో పరుగుల విషయం పక్కకు పెట్టి వికెట్లను కాపాడుకోవడానికే ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ నానా తంటాలు పడ్డారు. వార్నర్‌, ఫించ్‌లు రాణించడంతో ఫస్ట్‌ హాఫ్‌లో ఆసీస్‌దే పై చేయి. కానీ అమిర్‌ ఎంట్రీ అయ్యాక సెకండ్‌ హాఫ్‌లో ఆసీస్‌ చతికలపడింది. 

ఓపెనర్లు మినహా..
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. తొలుత ఇద్దరు ఓపెనర్లు ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకున్న అనంతరం గేర్‌ మార్చి పరుగుల వరద పారించారు. ముఖ్యంగా సారథి ఫించ్‌ పాక్‌ బౌలర్లపై విరుచుకపడ్డాడు. అయితే తొలి వికెట్‌కు 146 పరుగులు జోడించిన అనంతర పించ్‌ను అమిర్‌ పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌(10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా వార్నర్‌ తనదైన రీతిలో రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే శతకం పూర్తి చేసిన వార్నర్‌ను ఆఫ్రిది ఔట్‌ చేస్తాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మన్‌ ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో 350 పరుగులకి పైగా స్కోర్‌ సాధిస్తుందనుకున్న ఆసీస్‌ చివరికి 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది.


చదవండి: 
పాక్‌తో మ్యాచ్‌: ఆసీస్‌ ఓపెనర్ల అరుదైన ఘనత
కోహ్లిని తప్పుబట్టిన మాజీ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

12-06-2019
Jun 12, 2019, 17:59 IST
నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన కోహ్లి సేన గురువారం న్యూజిలాండ్‌తో...
12-06-2019
Jun 12, 2019, 17:00 IST
గిల్‌క్రిస్ట్‌, హెడెన్‌ వంటి దిగ్గజ ఓపెనర్లతో సాధ్యంకాని రికార్డును వార్నర్‌, ఫించ్‌లు అందుకున్నారు
12-06-2019
Jun 12, 2019, 15:11 IST
టాంటన్‌: ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ తలపడుతోంది. టాస్‌ గెలిచిన...
12-06-2019
Jun 12, 2019, 14:30 IST
గాయాలు తననేం చేయలేవని, తాను ఏం చేయాలనుకున్నానో అది చేస్తానని..
12-06-2019
Jun 12, 2019, 13:18 IST
వార్నర్‌, స్మిత్‌లను భారత అభిమానులు తిట్టకుండా ఆపే హక్కు కోహ్లికి ఉందా?
12-06-2019
Jun 12, 2019, 12:20 IST
వంకరటింకరగా ఉన్న మైదాలనుద్దేశించి కుళ్లు జోకులు పేలుతున్నాయి..
12-06-2019
Jun 12, 2019, 11:41 IST
మేం టోర్నీ మధ్యలో ఏలాంటివి మార్చలేం. అలా చేస్తే టోర్నీ సమగ్రత దెబ్బతింటుంది
12-06-2019
Jun 12, 2019, 09:11 IST
ఈ ప్రపంచకప్‌లో 11వ జట్టుగా వర్షం పాల్గొంది. అది 3 మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లతో టైటిలే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ...
12-06-2019
Jun 12, 2019, 03:54 IST
టాంటన్‌: ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో నేడు జరిగే మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌...
12-06-2019
Jun 12, 2019, 03:46 IST
బ్రిస్టల్‌: శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ స్వదేశానికి పయనమయ్యాడు. మలింగ అత్త మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడానికి మంగళవారం...
12-06-2019
Jun 12, 2019, 03:33 IST
బ్రిస్టల్‌: ప్రపంచ కప్‌లో వర్షం దెబ్బకు మూడో మ్యాచ్‌ కొట్టుకుపోయింది. టాస్‌ వేసే అవకాశమూ లేనంతటి వానతో శ్రీలంక–బంగ్లాదేశ్‌ మధ్య...
12-06-2019
Jun 12, 2019, 03:26 IST
నాటింగ్‌హామ్‌: ప్రపంచ కప్‌లో రెండు అద్భుత విజయాలు సాధించి ఊపు మీదున్న భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది....
11-06-2019
Jun 11, 2019, 22:11 IST
బ్రిస్టల్‌: యార్కర్ల కింగ్‌, శ్రీలంక సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ స్వదేశానికి పయనమయ్యాడు. తన అత్త మరణించడంతో ఆమె...
11-06-2019
Jun 11, 2019, 20:50 IST
పాక్‌ ఫ్యాన్స్‌ క్రికెట్‌ను ఎంత ఇష్టపడతారో ఆటగాళ్లను అంతకంటే ఎక్కువ గౌరవిస్తారు
11-06-2019
Jun 11, 2019, 19:53 IST
టాంటాన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో బుధవారం పాకిస్తాన్‌తో జరుగనున్న మ్యాచ్‌కు ఆస్ట్రేలియా ఆల్‌ రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో...
11-06-2019
Jun 11, 2019, 18:58 IST
అసలే అది పాకిస్తాన్‌.. ఆపై ఓ మ్యాచ్‌ గెలిచింది.. వర్షం కారణంగా ఆట రద్దవడంతో మరో పాయింట్‌ కూడా ఖాతాలో...
11-06-2019
Jun 11, 2019, 18:46 IST
బ్రిస్టల్‌: వన్డే వరల్డ్‌కప్‌ను వర్షం వెంటాడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా, తాజాగా శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్ల...
11-06-2019
Jun 11, 2019, 18:43 IST
సీనియర్‌ ఆటగాడు రాయుడు ఉన్నప్పటికీ ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా పంత్‌ను పంపించే అవకాశం..
11-06-2019
Jun 11, 2019, 17:58 IST
లండన్ ‌: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు స్టీవ్‌​ వా ప్రశంసల జల్లు కురిపించాడు....
11-06-2019
Jun 11, 2019, 17:08 IST
లండన్‌: ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో స్పిన్‌ విభాగంలో యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లది ప్రధాన పాత్ర. ఇటీవల కాలంలో...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top