భారత జట్లకు ‘డ్రా’

భారత జట్లకు ‘డ్రా’


బాకు (అజర్‌బైజాన్): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లకు ‘డ్రా’ ఎదురైంది. సోమవారం జరిగిన పదో రౌండ్‌లో భారత పురుషుల జట్టు 2-2తో రష్యాతో... మహిళల జట్టు 2-2తో ఉక్రెయిన్‌తో ‘డ్రా’ చేసుకున్నాయి. పురుషుల విభాగంలో సెర్గీ కర్జాకిన్‌పై హరికృష్ణ 44 ఎత్తుల్లో గెలుపొందగా... సేతురామన్-గ్రిషుక్; విదిత్-నెపోమ్‌నియాచిల మధ్య గేమ్‌లు ‘డ్రా’ అయ్యాయి. క్రామ్నిక్ చేతిలో ఆధిబన్ ఓడిపోయాడు. మహిళల విభాగంలో హారిక-అనా ముజిచుక్; పద్మిని-మరియా ముజిచుక్‌ల మధ్య గేమ్‌లు ‘డ్రా’ అయ్యారుు. జుకోవాపై తానియా సచ్‌దేవ్ నెగ్గగా... ఉషెనినా చేతిలో సౌమ్య ఓడిపోయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top