నేటి నుంచి మహిళల టి20 క్రికెట్ టోర్నీ | Women's T-20 cricket tournament from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మహిళల టి20 క్రికెట్ టోర్నీ

Feb 2 2014 12:28 AM | Updated on Sep 2 2017 3:15 AM

నగరంలో నేటి నుంచి సీనియర్ మహిళల టి20 ఎలైట్ గ్రూప్-ఎ క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ....

జింఖానా, న్యూస్‌లైన్: నగరంలో నేటి నుంచి సీనియర్ మహిళల టి20 ఎలైట్ గ్రూప్-ఎ క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ.... జింఖానా, ఏఓసీ సెంటర్ మైదానాల్లో జరుగుతుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో హైదరాబాద్, ఒరిస్సా, మహారాష్ట్ర, హర్యానా, రైల్వేస్ జట్లు పాల్గొంటున్నాయి.
 
 తొలి రోజు మ్యాచ్‌లో హైద రాబాద్... హర్యానాతో జింఖానా మైదానంలో అమీతుమీ తేల్చుకోనుంది. అనంతరం 4వ తేదీన రైల్వేస్‌తో, 5వ తేదీన మహారాష్ట్రతో, 6వ తేదీన ఒరిస్సాతో పోటీపడనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement