50 ఓవర్ల మ్యాచ్‌; 571 పరుగుల విజయం | Womens Cricket Team Registers 571 Run Victory In 50 Over Game | Sakshi
Sakshi News home page

50 ఓవర్ల మ్యాచ్‌; 571 పరుగుల విజయం

Oct 18 2018 11:53 AM | Updated on Oct 18 2018 11:54 AM

Womens Cricket Team Registers 571 Run Victory In 50 Over Game - Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా స్థానిక టోర్నీలో సంచలనం నమోదైంది. 50 ఓవర్ల మహిళల క్రికెట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఒక జట్టు 571 పరుగుల తేడాతో విజయం సాధించింది . ఎస్‌ఏసీఏ పీసీ స్టేట్‌వైడ్‌ మహిళల ఫస్ట్‌గ్రేడ్‌ మ్యాచ్‌లో నార్తర్న్‌ డిస్ట్రిక్స్‌, పోర్ట్‌ అడిలైడ్‌ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్తర్న్‌ డిస్ట్రిక్స్‌ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 596 పరుగుల భారీ స్కోరు చేసింది. నలుగురు క్రీడాకారిణులు సెంచరీల మోత మోగించారు.

టెగాన్‌ మెక్‌ఫార్లిన్‌ (80 బంతుల్లో 136), టాబీ సవిలీ (56 బంతుల్లో 120), శామ్‌ బెట్స్‌ (71 బంతుల్లో 124 నాటౌట్‌), డార్సీ బ్రౌన్‌ (84 బంతుల్లో 117 నాటౌట్‌) చెలరేగి ఆడారు. నార్తర్న్‌ డిస్ట్రిక్స్‌ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనకు దిగిన పోర్ట్‌ అడిలైడ్‌ ఒత్తిడిలో కేవలం 10.5 ఓవర్లలో 25 పరుగులకే కుప్పకూలింది. ఇందులో ఎనిమిది మందే బ్యాటింగ్‌ చేయడం గమనార్హం. ప్రతిభా కపూర్‌ 9 పరుగులతో జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement