సెరెనా కొత్త ‘స్లామ్‌’ రికార్డు సృష్టిస్తుంది: స్టెఫీ | Williams can 'absolutely' break Court's Grand Slam record Graf | Sakshi
Sakshi News home page

సెరెనా కొత్త ‘స్లామ్‌’ రికార్డు సృష్టిస్తుంది: స్టెఫీ

Nov 6 2017 4:22 AM | Updated on Nov 6 2017 4:22 AM

Williams can 'absolutely' break Court's Grand Slam record Graf - Sakshi

జుహై (చైనా): అమెరికన్‌ వెటరన్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ తిరిగి కోర్టులోకి దిగితే సరికొత్త గ్రాండ్‌స్లామ్‌ రికార్డును నెలకొల్పుతుందని టెన్నిస్‌ లెజెండ్‌ స్టెఫీగ్రాఫ్‌ అన్నారు. ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చిన సెరెనా ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు దూరమైంది. ఇక్కడ జరుగుతున్న డబ్ల్యూటీఏ ఎలైట్‌ ట్రోఫీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న స్టెఫీగ్రాఫ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘సెరెనా బరిలోకి దిగితే టెన్నిస్‌ గ్రేట్‌ మార్గరెట్‌ కోర్ట్‌ నెలకొల్పిన 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును చెరిపేస్తుంది’ అని చెప్పారు. ఇప్పటికే అమెరికన్‌ స్టార్‌ 23 టైటిళ్లతో స్టెఫీగ్రాఫ్‌ (22) రికార్డును అధిగమించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు సెరెనా వచ్చే జనవరిలో జరిగే ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో ఆడాలని ఆశిస్తున్నారు. ఈ ఏడాది రెండు వారాల గర్భంతో ఆస్ట్రేలియన్‌ బరిలోకి దిగిన ఆమె టైటిల్‌ సాధించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement