రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో రాటు దేలుతున్న అండర్-19 ఆటగాళ్లు ఆకలితో అలమటించాల్సిన పరిస్ధితి ఏర్పడింది.
భోజనం కోసం క్రికెటర్ల తిప్పలు
Feb 8 2017 10:07 PM | Updated on Sep 5 2017 3:14 AM
రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో రాటు దేలుతున్న అండర్-19 ఆటగాళ్లు ఆకలితో అలమటించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. క్రికెటర్లకు చెల్లించాల్సిన డైలీ అలవెన్సు అందకపోవడంతో వారందరూ హోటల్ బయటకు వెళ్లి నాణ్యత లేని ఆహారం తీసుకున్నారు. బీసీసీఐ నుంచి సెక్రటరీ అజయ్ షిర్కే, అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ లు తప్పుకున్న తర్వాత క్రికెటర్లకు అందిచాల్సిన నిధుల పేపర్లపై సంతకాలు చేసేవారు కరువయ్యారు.
సుప్రీంకోర్టు నియమించిన నలుగురు సభ్యుల ప్యానెల్ కు దగ్గరివాడైన ఓ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. విత్ డ్రా లిమిట్ అమలులో ఉండటం కూడా క్రికెటర్లకు నిధులు విడుదల చేయకపోవడానికి ఒక కారణమని చెప్పారు. అండర్-19 టీంలో ఎక్కువ మంది క్రికెటర్లు 18సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగివుండటంతో క్రెడిట్/డెబిట్ కార్డులను బీసీసీఐ ఇవ్వలేకపోయిందని తెలిపారు.
Advertisement
Advertisement