బ్యాటింగ్ లైనప్ బాలేదు:ధోనీ | We don't have the depth in batting, says Dhoni | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ లైనప్ బాలేదు: ధోనీ

Feb 7 2015 5:49 PM | Updated on Sep 2 2017 8:57 PM

బ్యాటింగ్ లైనప్ బాలేదు:ధోనీ

బ్యాటింగ్ లైనప్ బాలేదు:ధోనీ

గత కొంతకాలంగా టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య బౌలింగ్. అయితే బ్యాటింగ్ లో కూడా టీమిండియా పెద్దగా బలంగా ఏమీ లేదని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా స్పష్టం చేశాడు.

అడిలైడ్: గత కొంతకాలంగా టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య బౌలింగ్. అయితే బ్యాటింగ్ లో కూడా టీమిండియా పెద్దగా బలంగా ఏమీ లేదని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా స్పష్టం చేశాడు. ప్రస్తుతం టీమిండియాను బౌలింగ్ తో పాటు, బ్యాటింగ్ సమస్య కూడా వేధిస్తుందన్నాడు.  మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ఆరంభకానున్న నేపథ్యంలో ధోనీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టీమిండియాలో చివరి ఓవర్లలో సాధ్యమైనన్ని పరుగులు చేసే వికెట్లు లేవని ధోనీ పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్ లో పటిష్టంగా ఉంటే కచ్చితంగా అది ఫలితాన్నినిర్దేశిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

 

బ్యాటింగ్ ఆర్డర్ లో  సమయాన్ని బట్టే మార్పులు, చేర్పులు ఉంటాయని.. ఇందుకోసం ముందుగా ఏమీ సిద్ధం చేసుకోలేదన్నాడు. మిగతా టీమ్ లతో పోల్చికుంటే టీమిండియా బ్యాటింగ్ వీక్ గానే ఉందన్నాడు. వికెట్లు చేతిలో ఉంటే పరిస్థితుల్ని బట్టి పరుగులు చేయవచ్చని ఒక ప్రశ్నగా సమాధానంగా చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement