
బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాదిపాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో సెయింట్ లూసియా స్టార్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని సెయింట్ లూసియా జట్టు మేనేజర్ మొహమ్మద్ ఖాన్ స్పష్టం చేశాడు.
‘వార్నర్ ఒక దిగ్గజ ఆటగాడు. అతని రాకతో డ్రెస్సింగ్ రూమ్‌తో పాటు మైదానంలోనూ మా జట్టు పటిష్టంగా మారుతుంది. మేం సీపీఎల్ టైటిల్ గెలిచేందుకు వార్నర్ కీలకంగా వ్యవహరిస్తాడు’అని ఆయన అన్నారు.