వరంగల్ ‘డబుల్’ ధమాక | warangal gets double dhamka | Sakshi
Sakshi News home page

వరంగల్ ‘డబుల్’ ధమాక

Oct 25 2016 10:47 AM | Updated on Sep 4 2017 6:17 PM

అంతర్ జిల్లా త్రోబాల్ అండర్-14 చాంపియన్‌షిప్‌లో వరంగల్ జట్టు సత్తా చాటింది.

సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా త్రోబాల్ అండర్-14 చాంపియన్‌షిప్‌లో వరంగల్ జట్టు సత్తా చాటింది. రాయదుర్గ ఒయాసిస్ స్కూల్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో బాలబాలికల విభాగాల్లో విజేతగా నిలిచి టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. బాలుర ఫైనల్లో వరంగల్ 16-5, 15-12తో రంగారెడ్డిపై గెలుపొందింది. హైదరాబాద్ జట్టు 15-12, 14-16, 15-10తో నల్లగొండను ఓడించి మూడో స్థానాన్ని దక్కించుకుంది.

 

బాలికల విభాగంలో వరంగల్ 16-14, 15-12తో హైదరాబాద్‌పై గెలుపొంది విజేతగా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో కరీంనగర్ జట్టు 15-11, 15-6తో రంగారెడ్డి జట్టుపై పైచేరుు సాధించింది. అనంతరం తెలంగాణ స్కూల్ గేమ్స్ అబ్జర్వర్ పి. జగన్‌మోహన్ రెడ్డి విజేత జట్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement