'నాల్గో విజయం కూడా సాధిస్తాం' | Want to go into knockouts with four wins: KXIP coach R Sridhar | Sakshi
Sakshi News home page

'నాల్గో విజయం కూడా సాధిస్తాం'

Sep 27 2014 4:19 PM | Updated on Sep 2 2017 2:01 PM

ఛాంపియన్స్ లీగ్ లో నాల్గో విజయం కూడా సాధించి పరిపూర్ణంగా నాకౌట్ కు వెళ్లాలనుకుంటున్నామని కింగ్స్ పంజాబ్ కోచ్ ఆర్. శ్రీధర్ స్పష్టం చేశాడు.

మొహాలీ:ఛాంపియన్స్ లీగ్ లో నాల్గో విజయం కూడా సాధించి పరిపూర్ణంగా నాకౌట్ కు వెళ్లాలనుకుంటున్నామని కింగ్స్ పంజాబ్ కోచ్ ఆర్. శ్రీధర్ స్పష్టం చేశాడు. ఆదివారం కేప్ కోబ్రాస్ పై కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తాము సెమీస్ లోకి అడుగుపెట్టినా.. కేప్ కోబ్రాస్ తో జరిగే మ్యాచ్ ను తేలిగ్గా తీసుకోవడం లేదన్నారు. శనివారం నార్తరన్ డిస్ట్రిక్స్ తో జరిగిన మ్యాచ్ లో 120 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

తమ జట్టు సెమీస్ కు చేరిన అంశాన్ని పరికిస్తే.. చివరి వరుస ఆటగాళ్లకు బ్యాటింగ్ రాకుండా పంజాబ్ అద్భుత విజయాలు నమోదు చేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. టీం పరిస్థితిని చూస్తే నాల్గో విజయం కూడా సాధిస్తామని శ్రీధర్ తెలిపాడు. ప్లే ఆఫ్ లో అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించి నాకౌట్ రౌండ్ లో ఘనంగా అడుగుపెడతామన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement