‘ప్రపంచకప్‌కు పంత్‌ అవసరం లేదు’

VVS Laxman Picks India Squad for World Cup 2019 - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌

న్యూఢిల్లీ : ప్రపంచకప్‌కు యువ సంచలనం, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అవసరం లేదని టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా టోర్నీకి సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ధోని, బ్యాకప్‌ కీపర్‌గా దినేశ్‌ కార్తీక్‌లు సరిపోతారని చెప్పుకొచ్చాడు. స్టార్‌ స్పోర్ట్స్‌తో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. లిమిటెడ్‌ ఫార్మాట్‌లో పంత్‌ ఫామ్‌లో లేడని, గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 4, 40 నాటౌట్‌, 28,3,1 పరుగులే అతని ప్రదర్శనను తెలియజేస్తున్నాయని తెలిపాడు.

ప్రపంచకప్‌ టోర్నీ చాలా ప్రధానమైనదని, ఇలాంటి టోర్నీలకు యువ ఆటగాళ్ల కన్నా.. అనుభవం ఉన్న సీనియర్‌ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. సెలక్టర్లు పంత్‌ను పక్కనబెట్టి కార్తీక్‌ను ఎంపిక చేయాలని చెప్పుకొచ్చాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో నలుగురు పేసర్లు మహ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ ఖలీల్‌ అహ్మద్‌, ఇద్దరు స్పిన్నర్లు చహల్‌, కుల్దీప్‌లతో భారత్‌ బరిలోకి దిగాలన్నాడు.  

లక్ష్మణ్‌ ప్రకటించిన ప్రపంచకప్‌ జట్టు
రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లి, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోని, కేదార్‌జాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, యుజవేంద్ర చహల్‌, జస్ప్రిత్‌ బుమ్రా, భువనేశ్వర్‌, షమీ, రాహుల్‌ , దినేష్‌ కార్తీక్‌, ఖలీల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top