ఆసీస్ 438/3 | Voges, Marsh drive Australia to 438-3 | Sakshi
Sakshi News home page

ఆసీస్ 438/3

Dec 11 2015 2:27 AM | Updated on Sep 3 2017 1:47 PM

ఆసీస్ 438/3

ఆసీస్ 438/3

వెస్టిండీస్ పస లేని బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు.

 వోజెస్, మార్ష్ శతకాల మోత విండీస్‌తో తొలి టెస్టు
 హోబర్ట్: వెస్టిండీస్ పస లేని బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు. మిడిలార్డర్ ఆటగాళ్లు ఆడమ్ వోజెస్ (204 బంతుల్లో 174 బ్యాటింగ్; 19 ఫోర్లు), షాన్ మార్ష్ (205 బంతుల్లో 139 బ్యాటింగ్; 12 ఫోర్లు) ఇద్దరూ అజేయ సెంచరీలు చేయడంతో ఆసీస్ గురువారం తొలి రోజు ఆట ముగిసేసమయానికి 89 ఓవర్లలో మూడు వికెట్లకు 438 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్‌పై ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు సాధించిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (61 బంతుల్లో 64; 11 ఫోర్లు) వేగంగా ఆడాడు. ప్రారంభంలో మెరుగ్గా బౌలింగ్ చేసిన విండీస్ 121 పరుగులకు మూడు వికెట్లను పడగొట్టింది. అయితే వోజెస్, మార్ష్ జోడి ప్రత్యర్థికి సవాల్ విసిరింది. దీంతో ఇప్పటికే నాలుగో వికెట్‌కు 317 పరుగుల అజేయ భాగస్వామ్యం ఏర్పడింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement