
ముంబై: త్వరలో జరిగే చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు మంచి ప్రదర్శన కనబర్చే అవకాశం ఉందని వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్, దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ అభిప్రాయపడ్డాడు. ‘చెస్ ఒలింపియాడ్‌లో భారత్ ఐదు లేదా ఆరో స్థానంలో నిలిచే అవకాశముంది. రేటింగ్ పాయింట్లలో చాలా స్వల్ప తేడా మాత్రమే ఉంటుంది. ఒలింపియాడ్‌లో ఉండే ఫార్మాట్ ప్రకారం చూస్తే మనం స్వర్ణం గెలిచే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం. అయితే ఇతర జట్లూ బలంగా ఉన్నాయి. ఒలింపియాడ్‌లో నేను కూడా పాల్గొనాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ఆనంద్ వ్యాఖ్యానించాడు.