తన కెప్టెన్‌పై ట్వీట్లు పేల్చిన సెహ్వాగ్‌! | Virender Sehwag tweets on Sourav Ganguly | Sakshi
Sakshi News home page

తన కెప్టెన్‌పై ట్వీట్లు పేల్చిన సెహ్వాగ్‌!

Feb 4 2017 7:01 PM | Updated on Oct 3 2018 7:14 PM

తన కెప్టెన్‌పై ట్వీట్లు పేల్చిన సెహ్వాగ్‌! - Sakshi

తన కెప్టెన్‌పై ట్వీట్లు పేల్చిన సెహ్వాగ్‌!

టీమిండియా మాజీ క్రికెటర్‌, డాషింగ్‌​ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విట‍్టర్‌లో మరోసారి తనమార్క్‌ చూపించాడు.

టీమిండియా మాజీ క్రికెటర్‌, డాషింగ్‌​ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విట‍్టర్‌లో మరోసారి తనమార్క్‌ చూపించాడు. సెహ్వాగ్‌ కెరీర్‌ దాదాపుగా గంగూలీ కెప్టెన్సీలోనే కొనసాగింది. తన కెప్టెన్‌ గంగూలీతో ఆడిన క్రికెట్‌ ఆడిన రోజులను దాదా ఆటతీరుపై ట్వీట్లు పేల్చాడు సెహ్వాగ్‌. రెండు పాండాల ఫొటోలను పోస్ట్‌ చేసి, అద్దాలు పెట్టుకోకుంటే ఇలా ఉండే వ్యక్తి ఎవరంటూ ప్రశ్నను సంధించాడు. కొద్దిసేపయ్యాక కళ్లచుట్టూ నలుపు చారలున్నది గంగూలీ అని, మరొ పాండా చైనీస్‌ గంగూలీ అని పోస్ట్‌ చేశాడు సెహ్వాగ్‌.

అసలు విషయం ఏంటంటే.. గంగూలీకి కళ్లరెప్పలు వేగంగా ఆడించడం అలవాటన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. కళ్లు మిటకరిస్తూ స్పిన్నర్ల బౌలింగ్‌ ను దీటుగా ఎదుర్కొంటూ వారి బంతులను స్డేడియం బయటకు అవలీలగా పంపేస్తాడని డాషింగ్‌​ క్రికెటర్‌ రాసుకొచ్చాడు. గంగూలీ కెప్టెన్సీలోనే సెహ్వాగ్‌, యువరాజ్‌, హర్భజన్‌ సింగ్‌, మరికొందరు ఆటగాళ్లు ఎదిగిన విషయం తెలిసిందే.

సెహ్వాగ్‌ ట్వీట్లకు విశేష స్పందన రావడం విశేషం. మజా ఆ గయా వీరూ బాయ్‌ అని బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ రీట్వీట్‌ చేశాడు. ఓ ఫాలోయర్‌ అయితే, మా డాడీ గంగూలీ అలా కళ్లు మిటకరిస్తూ భారీ సిక్సర్‌ కొట్టే సీన్‌ను రిపీట్‌చేసి చూసేవారని పోస్ట్‌ చేశాడు. దాదాతో తన అనుబంధాన్ని ఇప్పటికే పలుమార్లు పంచుకున్న సెహ్వాగ్‌.. తాజాగా ట్వీట్లతో గంగూలీ ఆటపై ట్వీట్లు చేసి ఫాలోయర్లకు ఆనందాన్ని పంచుతున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement