కోహ్లి రికార్డు బద్దలయ్యేనా?

Virat Kohli World Record Under Threat by Hashim Amla - Sakshi

సౌతాంప్టన్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డుల గురించే చెప్తే ఒడిసేది కాదు.. రాస్తే పుస్తకం సరిపోదు. లెక్కలేనన్ని రికార్డులు కోహ్లి సొంతం. అయితే ప్రపంచకప్‌లో భాగంగా నేడు(బుధవారం) దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తో కోహ్లికి సంబంధించిన ఓ రికార్డుకు ముప్పు ఉంది. దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ హషీమ్‌ ఆమ్లా ఆ రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరగులు పూర్తి చేసిన రికార్డు భారత సారథి పేరిట ఉంది. 183 మ్యాచ్‌లు, 175 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి ఈ ఘనతను అందుకున్నాడు. అప్పటి వరకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలయర్స్‌(190 మ్యాచ్‌లు..182 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లి తన పేరిట లిఖించుకున్నాడు. ఆ తర్వాత సౌరవ్‌ గంగూల్‌, రోహిత్‌ శర్మ, రాస్‌ టేలర్‌లు ఈ జాబితాలో ఉన్నారు.

అయితే ఇప్పుడు ఆమ్లాకు ఈ ఘనతను అందుకునే అవకాశం ఉంది. 175 మ్యాచ్‌లు 172 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆమ్లా 7923 పరుగులు చేశాడు. కోహ్లి రికార్డు​​​కు ఇంకా 77 పరుగుల దూరంలో ఉ‍న్నాడు. అయితే నేడు జరిగే మ్యాచ్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఆమ్లా ఈ పరుగులు సాధిస్తే కోహ్లి రికార్డు బద్దలుకానుంది. నేటి మ్యాచ్‌ ఇన్నింగ్సే కాకున్నా.. మరో ఇన్నింగ్స్‌లో సాధించిన కోహ్లిని అధిగిమించే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ సైతం 8 వేల పరుగులు పూర్తిచేయడానికి 22 పరుగుల దూరంలో ఉన్నప్పటికి వేగవంతమైన జాబితాలో లేడు. అయితే ఆమ్లా ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ ఆరంభమ్యాచ్‌లో గాయపడి.. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. భారత్‌తో మ్యాచ్‌కు సిద్దమైనప్పటికి గాయంతో కొలుకుని ఏమాత్రం రాణిస్తాడనేది ప్రశ్న. ఇప్పటికే వరుస రెండు మ్యాచ్‌లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న సఫారీలు.. భారత్‌తో ఏ మాత్రం రాణిస్తారో చూడాలి.

 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top