'విరాట్ కోహ్లినే బెస్ట్ బ్యాట్స్మన్' | Virat Kohli the best batsman in the world, says Mohammad Amir | Sakshi
Sakshi News home page

'విరాట్ కోహ్లినే బెస్ట్ బ్యాట్స్మన్'

Jun 16 2016 5:49 PM | Updated on Sep 4 2017 2:38 AM

'విరాట్ కోహ్లినే బెస్ట్ బ్యాట్స్మన్'

'విరాట్ కోహ్లినే బెస్ట్ బ్యాట్స్మన్'

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

లాహోర్: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్ ప్రశంసల వర్షం కురిపించాడు.  ప్రపంచ క్రికెట్లో  అత్యుత్తమ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లినే అని కొనియాడాడు. బంగ్లాదేశ్లో జరిగిన ఆసియా కప్లో కోహ్లి రాణించిన తీరే ఇందుకు ఉదాహరణ అన్నాడు.  ఆ టోర్నమెంట్లో పిచ్ బౌలర్లకు అనుకూలించినా అతను కచ్చితమైన షాట్లతో అలరించాడన్నాడు. ప్రస్తుతం తనదైన దూకుడును ప్రదర్శిస్తూ కోహ్లి పరుగులు రాబడుతున్నాడని ప్రశంసించాడు. కఠినమైన పరిస్థితులను కూడా కోహ్లి తనకు అనుకూలంగా మార్చుకుని చెలరేగిపోతుండమే అతన్ని ఉన్నతస్థానంలో నిలిపిందన్నాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాకిస్తాన్ జట్టులో ఉన్న ఆమిర్ ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్య్యూలో విరాట్ను పొగడ్తలతో ముంచెత్తాడు. గత ఆసియా పర్యటన సందర్భంగా ఆమిర్ను విరాట్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఆమిర్ ఒకడని విరాట్ అభినందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement